మహిళను ఈడ్చుకెళ్లిన కారు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 5 May 2022

మహిళను ఈడ్చుకెళ్లిన కారు !

 

ఏప్రిల్‌ 29 అర్థరాత్రి వేళ ఒక మహిళ క్యాబ్‌లో ప్రయాణిస్తున్నది. ఢిల్లీలోని ఓఖ్లా మండి చౌక్ వద్దకు ఆ క్యాబ్‌ చేరగా రోడ్డు మధ్యలో రెండు వాహనాలు నిలిపి వాగ్వాదానికి దిగారు. దీంతో మహిళ ప్రయాణిస్తున్న క్యాబ్ డ్రైవర్‌ దారి ఇవ్వాలని బాలెనో కారులోని వారిని అడిగాడు. అయితే అందులోని వ్యక్తులు క్యాబ్‌ డ్రైవర్‌ను తిట్టారు. దీంతో ఆ మహిళ కల్పించుకుంది. క్యాబ్‌ డ్రైవర్‌పై అలా మాట్లాడవద్దని అన్నది. దీంతో నీ పని చూసుకో అంటూ ఒకరు ఆమెను కూడా తిట్టాడు. ఆగ్రహించిన ఆ మహిళ ఆ వ్యక్తి చెంపపై కొట్టింది. దీంతో ఆ వ్యక్తి ఆమెను పలుసార్లు చెంపపై కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. మరోవైపు కారులోని అతడి స్నేహితుడు మహిళ వద్దకు వచ్చి ఆమె చెంపపై కొట్టాడు. దీంతో ఆ కారును ఆపేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే కారు వేగం పెంచి ఆమెను కొంత దూరం ఈడ్చికెళ్లారు. అనంతరం ఆ మహిళ రోడ్డుపై పడగా మోకాలికి గాయాలయ్యాయి. అక్కడున్న వారు ఆమెకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనపై ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫరీదాబాద్‌కు చెందిన కారు యజమాని 25 ఏండ్ల ఉదయవీర్ సింగ్‌ను అరెస్ట్‌ చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై అధికారులు చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ ఘటన సందర్భంగా కొందరు తమ మొబైల్‌లో రికార్డు చేసిన ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

No comments:

Post a Comment