జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి సత్యేంద్ర జైన్ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 31 May 2022

జూన్ 9 వరకు ఈడీ కస్టడీకి సత్యేంద్ర జైన్


ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో హాజరయ్యారు. మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఢిల్లీ కోర్టు జూన్ 9వ తేదీ వరకు ఈడీ కస్టడీకి పంపింది.మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ బీజేపీపై విరుచుకుపడ్డారు. తమ మంత్రిపై అక్రమంగా కేసు మోపారని, రాజకీయ కారణాలతో ఆయనపై కేసు పెట్టారని అన్నారు. తమ పార్టీ, ప్రభుత్వాలు (ఢిల్లీ, పంజాబ్) నిజాయితీకి కట్టుబడి ఉన్నాయని, అవినీతిని సహంచమన్నారు. ఈ కేసులో మంత్రి సత్యేంద్ర జైన్ పై వచ్చిన ఆరోపణల్లో ఒక్క శాతమైన నిజమున్నట్లు తేలినా తానే స్వయంగా ఆయనపై చర్యలు తీసుకునేవాడినని చెప్పారు.  అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవల పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ సింగ్లాను సీఎం భగవంత్ మాన్ తన మంత్రివర్గం నుంచి తొలగించిన విషయాన్ని సీఎం కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను దాచిపెట్టే అవకాశం ఉన్నా... ఆప్ ప్రభుత్వం చొరవ తీసుకుని, మంత్రిని అరెస్ట్ చేసిందన్నారు. అయిదేళ్ల క్రితం కూడా ఢిల్లీలో ఒక మంత్రిని తొలగించి, సీబీఐకి లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము దర్యాప్తు సంస్థల కోసం వేచి చూడమని, తామే స్వయంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సత్యేందర్ జైన్ కేసును తాను స్వయంగా అధ్యయనం చేసినట్లు సీఎం కేజ్రీవాల్ చెప్పారు. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, జైన్ సత్యమార్గంలో నడుస్తున్నారని, ఆయన తప్పనిసరిగా నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పారు.

No comments:

Post a Comment