2024 ఎన్నికల్లో దేశంలోకి బీజేపీకి నో ఎంట్రీ

Telugu Lo Computer
0


కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా ప్రతిపక్షాల్ని బీజేపీ ని చూస్తుందాని, హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024లో దేశంలో చోటులేదని అన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ''కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్షాలపైనే పని చేస్తాయా? బీజేపీ నేతలపై పని చేయవా? దేశాన్ని బీజేపీ నాశనం చేసింది. డీమానిటైజేషన్ వంటి చర్యల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేలా చేశారు. డీ మానిటైజేషన్ ఒక పెద్ద స్కామ్. నేను ఎవరికీ భయపడను. ప్రజల సంక్షేమం విషయంలో నా శక్తి ఉన్నంతవరకు పోరాడుతా. హింస, ద్వేషంతో కూడిన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి 2024 ఎన్నికల్లో దేశంలోకి నో ఎంట్రీ'' అని మమత విమర్శించారు. వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలపై ఇటీవల సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. బిహార్ నేత లాలూ ప్రసాద్ యాదవ్, మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్, ఢిల్లీ ఆప్ నేత సత్యేంద్ర కుమార్ జైన్ వంటి వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేశాయి. తాజాగా బెంగాల్ కోల్ స్మగ్లింగ్ కేసులో మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీతోపాటు, అతడి భార్య రుజిరపై కూడా కేంద్ర సంస్థలు దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తుండటంపై మమతా బెనర్జీ కేంద్రంపై విమర్శలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)