చిలుకను పట్టిస్తే రూ. 5 వేలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 6 May 2022

చిలుకను పట్టిస్తే రూ. 5 వేలు !


ఉత్తరప్రదేశ్, గయాలోని పిప్రపాటి ప్రాంతానికి చెందిన శ్యామ్ దేవ్ ప్రసాద్ గుప్తా, సంగీత గుప్తా అనే దంపతులు పెంచుకున్న చిలుక ఈ మధ్య ఇంట్లోని వెళ్లిపోయిందట. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో పోస్టర్లు వేయించారు. తమ చిలుకను ఎవరైనా పట్టిస్తే 5,100 రూపాయలను బహుమానంగా ఇస్తామని కూడా ప్రకటించారు. ఈ మధ్యే చిలుక వెళ్లిపోయిందని, తాము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. చెట్ల దగ్గరికి వెళ్లి, తాము రోజూ మాట్లాడుకునే భాషలో పిలుస్తున్నామని, అయినా అది దొరకడం లేదని వాపోయారు. ఈ దంపతులు కేవలం పోస్టర్లకు మాత్రమే పరిమితం కాలేదు. తమ చిలుక తప్పిపోయిందని సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం చేస్తున్నారు. 12 ఏళ్లుగా తాము దీనిని పెంచుకుంటున్నామని, ఓ రోజు హఠాత్తుగా ఇంట్లోంచి వెళ్లిపోయిందని అంటున్నారు. ఎవరు తీసుకుంటే దయచేసి తమకు ఇచ్చేయాలని ఆ దంపతులు విజ్ఞప్తులు చేస్తున్నారు.

No comments:

Post a Comment