3వేల కోసం థియేటర్‌లో పనిచేశా! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 17 May 2022

3వేల కోసం థియేటర్‌లో పనిచేశా!


కమల్ హాసన్ తో విడాకులు తీసుకున్న అనంతరం సారిక ముంబైకి షిఫ్ట్ అయ్యారు. అక్కడే నివసిస్తున్నారు. తాజాగా తాను డబ్బులు కోసం పడిన కష్టాన్ని సారిక గుర్తు చేసుకున్నారు. తన దగ్గర లాక్‌డౌన్ సమయంలో డబ్బు లేకుండా పోయిందని,  లాక్ డౌన్ సమయంలో పాండమిక్ రావడంతో సేవింగ్స్ పూర్తిగా అయిపోయాయని, దీంతో థియేటర్ ఆర్టిస్టులతో వర్క్ చేశానని తెలిపింది. కానీ వారు రూ. 2000 – రూ.2700 వరకు మాత్రమే చెల్లిస్తుండటంతో మళ్లీ సినిమాల్లో నటించడమే బెస్ట్ అని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం సారిక అమెజాన్ ప్రైమ్ ‘మోడ్రన్ లవ్ ముంబై’ ఆంథాలజీలోని ‘మై బ్యూటిఫుల్ రింకిల్స్’ పార్ట్‌ లో నటించి తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది. రాజ్‌పుత్ సంతతికి చెందిన మహారాష్ట్ర కుటుంబంలో జన్మించిన సారిక చాలా చిన్న వయస్సులో తన తండ్రిని కోల్పోయింది. దీంతో సారిక తన కుటుంబానికి ఏకైక జీవనోపాధిగా మారింది. కేవలం 5 సంవత్సరాల వయస్సులో, సారిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో తన కెరీర్‌ను ప్రారంభించింది. 2000 సంవత్సరంలో, హే రామ్ చిత్రానికి గాను సారిక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌గా జాతీయ అవార్డును గెలుచుకుంది. 2005లో నటి పర్జానియా చిత్రంలో తన నటనకు ఉత్తమ నటిగా మరొక జాతీయ అవార్డును గెలుచుకుంది. సారిక విశ్వనటుడు కమల్ హాసన్‌తో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత 1988లో పెళ్లి చేసుకున్నది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. శృతి హాసన్, అక్షర హాసన్‌ లు. అయితే, 16 ఏళ్ల పాటు కలిసి ఉన్న సారిక, కమల్ 2004లో విడాకులు తీసుకున్నారు. అనంతరం సారిక మళ్ళీ ముంబైకి చేరుకుంది. అక్కడ థియేటర్ డ్రామాస్ లో నటిస్తూ.. జీవిస్తోంది.

No comments:

Post a Comment