'అమ్మఒడి'లో రూ.2000 మినహాయింపు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో బడికి వెళ్లే చిన్నారులు ఉన్న ప్రతి తల్లికీ అమ్మఒడి పేరిట ఏటా రూ.15 వేలు చొప్పున ఇస్తామని 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం జగన్‌ గొప్పగా ప్రకటించారు. దీంతో తల్లులందరూ వైసీపీకి ఓట్లు వేశారని రాజకీయ విశ్లేషకులు అప్పట్లో విశ్లేషించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరం నుంచి కుటుంబంలో ఒక్కరికే ఈ పథకాన్ని పరిమితం చేశారు. అంతేకాదు ఇచ్చే మొత్తంలోనూ రెండో ఏడాది నుంచి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.1,000 కోత పెట్టి 14 వేలు చేతిలో పెట్టారు. ఇప్పుడు రూ.2000 తగ్గించి పథకాన్ని రూ.13 వేలకు కుదించారు. ఈ 2 వేలను పాఠశాల మరుగుదొడ్ల నిర్వహణకు వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. వాస్తవానికి పాఠశాలల్లోని మరుగుదొడ్ల నిర్వహణకు సర్కారే నిధులు కేటాయిస్తుంది. అయితే, వైసీపీ హయాంలో నిధులు ఇవ్వడం ఆపేసి 'అమ్మఒడి' నుంచి మరుగుదొడ్ల నిర్వహణకు నిధులు మినహాయిస్తున్నారు. దీంతో అమ్మఒడి పథకంపై ఆశలు పెట్టుకున్న లబ్ధిదారులైన అమ్మలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)