ఉస్మానియా ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 7 April 2022

ఉస్మానియా ఆస్పత్రిలో రోగి ఆత్మహత్య


హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగి ఆస్పత్రి నాలుగో అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులు, వారి బంధువులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటన జరిగిన తీరుపై వివరాలను ఆరా తీస్తున్నారు. మృతుడి బంధువులను అడిగి వివరాలు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం వీరెక్ కాలనీకి చెందిన నాగరాజు ఈనెల 2 న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన అతని భార్య, కుటుంబసభ్యులు నాగరాజుకు వైద్య చికిత్స అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రికే తీసుకువచ్చారు. అక్కడ నాగరాజును పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నాగరాజుకు మద్యం అలవాటు ఉండడంతో ఆస్పత్రిలో మద్యం తాగాడు. ఇలా చేయవద్దని భార్య మందలించడంతో నాగరాజు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కోపంలో భార్యను పక్కకు తోసేసి నాల్గో అంతస్థులోకి వెళ్లాడు. వెళ్లిన కొద్దిసేపటికి కిటికీ అద్దాలను పగలగొట్టి అందులోనుంచి కిందికి దూకాడు. ఈ ఘటనలో నాగరాజు తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

No comments:

Post a Comment