ఎండా కాలంలో ఫ్రిడ్జ్ వాటర్ తాగకండి !

Telugu Lo Computer
0


ఎండా కాలం సీజన్‌లో చాలా మంది ఫ్రిడ్జ్ వాటర్‌ను తాగుతుంటారు. అయితే ఈ వాటర్ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత వ్యాధులు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపు సంబంధిత వ్యాధులతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చునని చెబుతున్నారు. ఫ్రిడ్జ్ వాటర్ ఆ సమయంలో మీ దాహాన్ని తీర్చినా అది శరీరంలోని వేడిని ఎక్కువ చేస్తుందని అంటున్నారు. దాహం తీర్చుకోవడానికి కాచి చల్లార్చిన నీటిని తాగమని సలహా ఇస్తున్నారు. అలాగే వేసవిలో వేడి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందించడంలో సహాయపడతాయన్నారు. చక్కెరతో కూడిన పండ్ల రసాలకు దూరంగా ఉండమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తాజా పండ్ల రసాలను ఆస్వాదించేటప్పుడు.. చక్కెర, ఐస్‌ లేకుండా తీసుకోవాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పులుపు తక్కువున్న పండ్లను తీసుకోవాలన్నారు. దోసకాయ, పొట్లకాయ, కీరా దోసకాయలు, జాక్‌ఫ్రూట్, మామిడి, పుచ్చకాయ, అరటి పండ్లు లాంటివి ఈ సీజన్‌లో తినడం సరోత్తమం.

Post a Comment

0Comments

Post a Comment (0)