పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ రద్దు

Telugu Lo Computer
0


పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీని ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ రద్దు చేశారు. ఇమ్రాన్ ఖాన్ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించనున్నారు.  అంతకుముందు ఇమ్రాన్ ఖాన్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ అనుమతించలేదు. సభను నిరవధికంగా వాయిదా వేశారు. విదేశీ కుట్ర, దేశ భద్రత కారణాలను చూపుతూ ఈ తీర్మానాన్ని తిరస్కరించారు. అనంతరం ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, ప్రభుత్వాన్ని మార్చాలనే కుట్ర భగ్నమైందన్నారు. దేశ ప్రజలను అభినందించారు. కుట్రలు పాకిస్థాన్‌లో చెల్లబోవన్నారు. ముందస్తు ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. నేషనల్ అసెంబ్లీని రద్దు చేయాలని దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీని కోరారు. ''అసెంబ్లీని రద్దు చేయాలని నేను దేశాధ్యక్షునికి లేఖ రాశాను. ప్రజాస్వామిక విధానంలో ఎన్నికలు జరగాలి. ప్రజలు ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రజలను కోరుతున్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజలే నిర్ణయిస్తారు'' అని ఇమ్రాన్ చెప్పారు. ఈ నేపథ్యంలో 90 రోజుల్లోగా నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)