రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 17 April 2022

రాగల నాలుగు రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు


తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు మూడు రోజులుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఎండల నుంచి ఉపశమనం కలుగుతుందని ప్రభావిస్తున్నప్పటికీ.. రైతులు మాత్రం పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటం తీవ్రనష్టాన్ని కలిగిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఏప్రిల్ 21 నుంచి వాతావరణంలో పెద్దగా మార్పులేం ఉండవని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా, శనివారం హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా కురిశాయి. ఆదిలాబాద్‌ జిల్లా భోరజ్‌లో 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 39.9, రామగుండంలో 39.4, హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లో 39.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాత్రి పూట కనిష్ట ఉష్ణోగ్రతలు నిజామాబాద్, భద్రాచలంలో 28.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు నెలరోజులుగా ఎండల వేడితో ఇబ్బందులు పడుతున్న ప్రజలు.. గత రెండు మూడ్రోజుల నుంచి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. మరోవైపు, పంట చేతికొచ్చే సమయం కావడంతో ఎక్కడ పంట నేల పాలవుతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న రెండు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీ ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లోనూ వర్షాలు పలు ప్రాంతాల్లో కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలు చల్లని వాతావరణంలోకి వెళ్లాయి. మరోవైపు, అకాల వర్షాలతో పంటలు పాడవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

No comments:

Post a Comment