భారీగా తగ్గిన బంగారం ధర

Telugu Lo Computer
0


గత వారం రోజుల నుండి దూకుడుగా ఉన్న బంగారం ధర వారాంతానికి తగ్గుముఖం పట్టింది. గత వారంతో పోలిస్తే ఈరోజు బంగారం 10 గ్రాముల ధర దాదాపు 900 వందల రూపాయల వరకూ తగ్గింది. ఈరోజు మార్కెట్లో 22 క్యారెట్ బంగారం 48,990 నుండి ప్రారంభమయింది. గత సోమవారం అంటే 18వ తేదికి 22 క్యారెట్ల బంగారం 49,850 రూపాయలుగా వుంది. ఇక 24 క్యారెట్ స్వచ్చమైన బంగారం ధర ఈరోజు 53,440 నుండి ప్రారంభమయ్యింది. వాస్తవానికి, ఏప్రిల్ నెలలో 22 క్యారెట్ బంగారం ధర 50 వేల మార్కును టచ్ చేసింది. ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,890 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,440 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది.  చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,440 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,940 గా ఉంది. హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,440 గా ఉంది. విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,440 గా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)