ఉత్తర్ ప్రదేశ్ సీఎంఓ ట్విట్టర్ హ్యాక్ - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Friday, 8 April 2022

ఉత్తర్ ప్రదేశ్ సీఎంఓ ట్విట్టర్ హ్యాక్


ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ఖాతాను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. శుక్రవారం రాత్రి హ్యాక్ అయిన విషయాన్ని అధికారులు గుర్తించారు. హ్యాకర్ అనేక పోస్టులు చేశాడు. కొన్ని గంటల తర్వాత ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు. హ్యాకర్లు ప్రొఫైల్ ఫొటోను కూడా మార్చివేయడం గమనార్హం. ఓ కార్టునిస్టు చిత్రాన్ని ప్రొఫైల్ పిక్చర్ గా ఉపయోగించారు. Tutorial : How to Turn on your BAYC/MAYC అనే ట్వీట్ ను పిన్ చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ట్యాగ్ చేస్తూ.. హ్యాక్ చేసిన ఖాతా స్క్రీన్ షాట్లను నెటిజన్లు షేర్ చేశారు. హ్యాకర్లు పెట్టిన ట్వీట్లను డిలీట్ చేశారు. హ్యాక్ అయిన సీఎంఓ అకౌంట్ స్క్రీన్ షాట్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. UP CMO @CMOfficeUP ట్విట్టర్ ఖాతాకు ప్రస్తుతం నాలుగు మిలియన్ల మంది పాలోవర్లు ఉన్నారు. ప్రభుత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ హ్యాక్ కావడం ఇది మొదటిసారి కాదు. గత సంవత్సరం డిసెంబర్ లో ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైన సంగతి తెలిసిందే. బిట్ కాయిన్ ను ప్రమోట్ చేస్తూ… పోస్టులు చేసిన సంగతి తెలిసిందే. బిట్ కాయిన్ ను భారత ప్రభుత్వం లీగల్ చేసినట్లు, 500 బిట్ కాయిన్ లను కొనుగోలు చేసి ప్రజలకు పంచుతోందని లింక్ లు పోస్టులు చేశారు. అధికారులు గుర్తించి ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించారు.

No comments:

Post a Comment