ఫోన్ మాట్లాడుతూ మ్యాన్ హోల్ లో పడ్డ మహిళ

Telugu Lo Computer
0


బీహార్ రాజధాని పాట్నాలోని ఓ ప్రాంతంలో ఏప్రిల్ 21న రోడ్డుపై వాహనాలు నిలిచి ఉన్నాయి. వాహనాల మధ్యలో నుంచి ఓ మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ, దిక్కులు చూసుకుంటూ వెళ్తుంది. ఇంతలో మహిళ ముందు ఉన్న ఆటో ముందుకు కదలగా..దాని కిందే మ్యాన్ హోల్ తెరుచుకుని ఉంది. నడుచుకుంటూ వెళ్తున్న ఆ మహిళ అది గమనించక మ్యాన్ హోల్లో పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తం అయి ఆ మహిళను రక్షించారు. చిన్న గాయాలతో బయటపడ్డ ఆ మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళ నడుచుకుంటూ వెళ్తూ మ్యాన్ హాల్లో పడిన దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీకేమెరాలో రికార్డు కాగా..ఉత్కర్ష్ సింగ్ అనే మీడియా ప్రతినిధి తన ట్విట్టర్ ఖాతాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవగా అది చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)