విడదల రజిని అధికారులతో సమీక్ష ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Monday, 18 April 2022

విడదల రజిని అధికారులతో సమీక్ష !


ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజని బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులు పరిశుభ్రంగా ఉండేలా తక్షణం చర్యలు చేపట్టాలని మంత్రి విడదల రజని ఆదేశించారు. మంత్రి కోవిడ్ సమయంలో వైద్యులు అద్భుతమైన సేవలందించారని ఇప్పుడు మళ్లీ కోవిడ్ విజృంభిస్తుందన్న ఆందోళనల నేపథ్యంలో అనుక్షణం పర్యవేక్షణ చేయాల్సిందిగా మంత్రి విడదల రజని ఆదేశించారు. ఇకపై ఫీవర్ సర్వేను నిరంతరం చేపట్టాల్సిందిగా  సూచించారు. నకిలీ మందులు ఎక్కడా విక్రయించుకుండా చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి డ్రగ్ కంట్రోల్ అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖలో జరిగిన బదిలీలకు సంబంధించి పర్యవేక్షించాలని ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు. జిల్లా ఆస్పత్రులు, వైద్య కళాశాలల అనుబంధ ఆస్పత్రులను ప్రాధాన్యతగా తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లోని పారిశుధ్ధ్యం, పడకల నిర్వహణ, రోగులకు అందే భోజనం అన్నీ సక్రమంగా లేకపోతే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

No comments:

Post a Comment