పెంపుడు శునకం కోసం బెడ్రూం

Telugu Lo Computer
0


అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న శునకం కోసం ఇంట్లో మెట్ల కింద ప్రత్యేకంగా ఓ బెడ్రూం నిర్మించిన మహిళ ఉదంతం తాజాగా వెలుగుచూసింది. తన పెంపుడు కుక్క కోసం ఇంట్లోని మెట్ల కింద నిర్మించిన బెడ్రూం వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుటుంబసభ్యులతోపాటు తన పెంపుడు కుక్క కోసం ఓ మహిళ స్వయంగా బెడ్రూం నిర్మించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.కుక్క బెడ్రూంలో అది పడుకునేందుకు వీలుగా పరుపు కూడా వేశారు. కుక్క తాగేందుకు మంచినీటిని సైతం ఉంచారు. కుక్క కోసం బెడ్రూం నిర్మాణం వీడియోకు నెటిజన్ల నుంచి షేర్‌లు,కామెంట్లు, లైక్‌లు వెల్లువెత్తాయి. కుక్క బెడ్రూంకు అద్దె ఎంత ఇవ్వాలి అని ఓ నెటిజన్ ప్రశ్నించారు. తన బెడ్రూం కంటే కుక్క బెడ్రూం అందంగా ఉందని మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)