శత్రు విమానాలు తునాతునకలు చేసే ఐరన్‌ బీమ్‌

Telugu Lo Computer
0



లేజర్‌ కిరణాలతో శత్రు విమానాలను తుత్తునియలు చేసే అధునాతన టెక్నాలజీని రూపొందిం చింది. 'ఐరన్‌ బీమ్‌’గా పిలిచే ఈ సరికొత్త ఆయుధ వ్యవస్థను ఇజ్రాయెల్‌ విజయవంతంగా పరీక్షించింది. శత్రువులు ప్రయోగించే రాకెట్లు, శతఘ్నులు, మోర్టార్లు, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను పసిగట్టి వాటిని గాల్లోనే పూర్తిగా, పాక్షికంగా ధ్వంసం చేసేదే 'ఐరన్‌ బీమ్‌’ గాజాలోని హమాస్‌ ఉగ్రవాదులు గత ఏడాది చేసిన రాకెట్‌ దాడులను తిప్పికొట్టడానికి ఇజ్రాయెల్‌ 'ఐరన్‌డోమ్‌’ను వాడటం తెలిసిందే. అయితే, హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై 1,200 వరకు రాకెట్లను ప్రయోగించారు. వీటిలో 200 రాకెట్లను డోమ్ ధ్వంసం చేసింది. దీని కోసం రూ. 235 కోట్లు ఖర్చు చేసింది. మిగతా వెయ్యి రాకెట్లను నిర్వీర్యం చేయలేకపోయింది. దీంతో ఇజ్రాయెల్‌లో భారీగా నష్టం సంభవించింది. ఈ క్రమంలోనే ప్రతీ రాకెట్‌, డ్రోన్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా ఈ 'ఐరన్‌ బీమ్‌’ను తీసుకొచ్చారు. లేజర్‌ కిరణాల సాయంతో ఇది పనిచేస్తుంది. 'ఐరన్‌డోమ్‌’తో ఒక్క రాకెట్‌ను పేల్చడానికి ఇప్పటివరకూ ఇజ్రాయెల్‌కు రూ. కోటి కంటే ఎక్కువ ఖర్చయ్యేది. 'ఐరన్‌ బీమ్‌’తో 3.5 డాలర్లతోనే ఒక్కో లక్ష్యాన్ని కూల్చేయవచ్చు. ఇంత చౌకైన సిస్టమ్‌ ప్రపంచంలో ఇప్పటివరకు ఎక్కడా లేదు. శత్రువుల విమానాన్ని పూర్తిగా లేక పాక్షికంగా నాశనం చేసే సామర్థ్యం దీని సొంతం. దీని కోసం లేజర్‌ కిరణాల తీవ్రతను మార్చుకొనే వెసులుబాటు ఉంది. అలాగే విమానంలోని నిర్ణీత భాగాన్ని మాత్రమే కూల్చే ప్రత్యేకతలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)