మళ్లీ పెరిగిన సీఎన్జీ ధర !

Telugu Lo Computer
0


దేశంలో గురువారం మరోసారి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌తోపాటు సీఎన్‌జీ ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. గురువారం సీఎన్‌జీ కిలోకు రూ.2.5 పెరిగింది. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల నగరాల్లో గురువారం సీఎన్‌జీ ధర కిలోకు రూ.2.5 పెంచామని ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) తెలిపింది. ఏప్రిల్ 14వతేదీ ఉదయం 6 గంటల నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చాయి.ఢిల్లీలో సీఎన్‌జీ కిలో రూ.71.60, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లలో కిలో రూ.74.17, ముజఫర్‌నగర్, మీరట్, షామ్లీలలో రూ. 78.84,గురుగ్రామ్ కిలో 79.94 రూపాయలకు పెరిగింది. మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) బుధవారం ముంబై చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇన్‌పుట్ ధరల భారీ పెరుగుదల కారణంగా సీఎన్జీ రిటైల్ ధర కిలోకు రూ. 5 పెంచింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ఇప్పుడు ముంబైలో కిలో రూ.72కి రిటైల్ అవుతోంది.ఏప్రిల్ 1 నుంచి దేశీయంగా ఉత్పత్తి చేసే సహజవాయువు సరఫరా ధరను కేంద్రం 110 శాతం పెంచినట్లు ఎంజీఎల్ తెలిపింది. పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్, సీఎన్జీ గ్యాస్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు సైతం పెరుగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)