'కోవిడ్' మరణాల సంఖ్యను దాస్తున్నారు!

Telugu Lo Computer
0


భారత్ లో సంభవించిన కోవిడ్ మరణాల వాస్తవ సంఖ్యను ప్రపంచ ఆరోగ్య సంస్థ వెలుగులోకి తేకుండా మోడీ మోకాలు అడ్డుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ మేరకు న్యూయార్క్ టైమ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించిందని రాహుల్ గుర్తు చేశారు. ఈమేరకు ట్విటర్ వేదికగా ఆయన ప్రధాని మోడీపై విమర్శలు గుప్పించారు. ” మోదీజీ నిజాలు చెప్పరు.. ఇతరులను నిజాలు చెప్పనివ్వరు. ఆక్సీజన్ కొరత కారణంగా దేశంలో భారీగా కోవిడ్ మరణాలు సంభవించాయనే వాస్తవాన్ని మోడీ ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను. మోడీ సర్కారు నిర్లక్ష్యం వల్ల.. దేశంలో 5 లక్షలు కాదు, 40 లక్షల కోవిడ్ మరణాలు చోటుచేసుకున్నాయి. ఇప్పటికైనా మోడీ బాధ్యత నిర్వర్తించాలి. కోవిడ్ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారాన్ని అందించాలి” అని తన ట్వీట్ లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ స్పందించింది. “కోవిడ్ మరణాల సంఖ్యను మేం దాచలేదు. విస్తీర్ణంలో, జనాభాపరంగా అతిపెద్దదైన భారత్ లోని కోవిడ్ మరణాలను గణించేందుకు, అతిచిన్న దేశాల్లో కోవిడ్ మరణాలను గణించేందుకు ఒకే విధమైన పద్ధతిని వాడొద్దని మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ కు సూచించాం” అని వివరణ ఇచ్చింద. న్యూయార్క్ టైమ్స్ మీడియా సంస్థ ఇండియాలో నమోదైన కోవిడ్ కేసులపై దృష్టిపెట్టినంతగా.. ఇతర దేశాలపై ఎందుకు దృష్టిపెట్టడం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)