న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలి

Telugu Lo Computer
0


న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని, అలాకాకుండా స్థానిక భాషలకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. స్థానిక భాషలతో సామాన్యులకు న్యాయవ్యవస్థలపై విశ్వాసం పెరుగుతుందనన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరుగుతున్న సీజేలు, సీఎంల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ప్రధాన సమస్యల పరిష్కారంలో న్యాయవ్యవస్థ పాత్ర కీలకమైనదని చెప్పారు. న్యాయవ్యవస్థ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సామాన్యులకు చట్టంలోని చిక్కులు కూడా తీవ్రమైన అంశమని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు హైకోర్టు, జిల్లా కోర్టులు బలోపేతమవ్వాలని ప్రధాని సూచించారు. న్యాయవ్యవస్థలో ఖాళీలను భర్తీ చేస్తున్నామని వెల్లడించారు. అత్యాధునిక సాంకేతికత సాయంతో మరిన్ని సంస్కరణలు రావాలన్నారు. డిజిటల్ ప్రపంచంలో సాంకేతికత ప్రధాన వనరుగా మారిపోయిందని చెప్పారు. సీఎంలు, హైకోర్టు సీజేలు డిజిటల్‌ ఇండియా ప్రగతిలో కలిసిరావాలని కోరారు. దేశంలో డిజిటల్‌ లావాదేవీలు అసంభవమని చెప్పారు. కానీ నేడు దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా డిజిటల్‌ లావాదేవీలు నడుస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక డిజిటల్‌ లావాదేవీలు భారత్‌లోనే జరుగుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాలను కూడా డిజిటలైజ్‌ చేయాలని పేర్కొన్నారు. దేశంలో అసంబద్ధంగా మారిన సుమారు 1800 చట్టాలను గుర్తించామని, వాటిలో 1450 చట్టాలను రద్దు చేశామన్నారు. కానీ రాష్ట్రాలు మాత్రం 75 చట్టాలను మాత్రమే రద్దు చేశాయని వెల్లడించారు.ఆరేండ్ల తర్వాత హైకోర్టు సీజేలు, సీఎంల సంయుక్త సమావేశం జరుగుతున్నది. ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు పాల్గొన్నారు. రాష్ట్రం తరపున మంత్రి ఇంగ్రకరణ్‌ రెడ్డి హాజరయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)