కోర్టులు ఇస్తున్న తీర్పును ప్రభుత్వాలు అమలు చేయడం లేదు !

Telugu Lo Computer
0


వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లతో ఈరోజు ఢిల్లీలో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ విధుల నిర్వహణలో లక్ష్మణ రేఖను గుర్తుంచుకుని పనిచేయాలని ఆయన సూచించారు. ఒకవేళ అన్నీ చట్టంలోబడే జరిగితే, అప్పుడు పరిపాలనా వ్యవస్థకు న్యాయవ్యవస్థ అడ్డురాదు అని ఎన్వీ రమణ అన్నారు. మున్సిపాల్టీలు, గ్రామ పంచాయితీలు సక్రమంగా డ్యూటీ నిర్వహిస్తే, పోలీసులు సరైన రీతిలో విచారణలు చేపడితే, అక్రమ కస్టడీ మరణాలను నిరోధిస్తే, అప్పుడు ప్రజలు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం ఉండదని సీజే రమణ తెలిపారు. కోర్టులు ఇస్తున్న తీర్పును అనేక ఏండ్ల నుంచి ప్రభుత్వాలు అమలు చేయడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి హాని కలిగించే అంశాలపై కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా కావాలనే ఆ తీర్పు అమలులో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆయన ఆరోపించారు. విధాన నిర్ణయాలు తమ పరిధిలోకి రావని, కానీ ఎవరైనా వ్యక్తి తమ వద్దకు ఫిర్యాదుతో వస్తే, ఆ వ్యక్తిని కోర్టు తిరస్కరించదని ఎన్వీ రమణ తెలిపారు. ప్రజల ఆశయాలను, ఆందోళనలను అర్దం చేసుకుని, వాటినిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత చట్టాలను చేయాలన్నారు. అధికారుల నిర్లక్ష్యం సహించేది లేదన్నారు. ప్రజా ప్రయోజన వాజ్యాలను, వ్యక్తిగత వాజ్యాలుగా వాడుతున్నట్లు ఆరోపించారు. రాజకీయ, కార్పొరేట్ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు పిల్స్ వేస్తున్నారని రమణ విమర్శించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)