పోలీసునే చితక్కొట్టిన ఘనుడు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Sunday, 10 April 2022

పోలీసునే చితక్కొట్టిన ఘనుడు !


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జై ప్రకాష్ జైస్వాల్‌ అనే కానిస్టేబుల్‌ పై ఒక వ్యక్తి దాడి చేయడం మొదలు పెట్టాడు. అయితే అక్కడే ఉన్న స్థానికులెవరు కనీసం ఆ దాడిని వారించే సాహసం కూడా చేయలేదు. పోలీసుల కథనం ప్రకారందినేష్‌ ప్రజాపతి అనే వ్యక్తి మోటర్‌ బైక్‌తో కానిస్టేబుల్‌ జై ప్రకాశ్‌ మోటార్‌ బైక్‌ని ఢీ కొట్టాడు. దీంతో కానిస్టేబుల్‌ దినేష్‌తో బైక్‌ జాగ్రత్తగా నడుపు అన్నాడు. అంతే కోపంతో ఆ కానిస్టేబుల్‌ లాఠీని లాక్కుని మరీ కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడకి కానిస్టేబుల్‌ చాలా సౌమ్యంగా అక్కడ నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు కూడా. కానీ దినేష్‌ మాత్రం కానిస్టేబుల్‌ని వదలకుండా వెంబడించి మరీ దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా ఆ నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజీవ్ సింగ్ భదౌరియా తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది.

No comments:

Post a Comment