కరోనా ఎక్స్ఈ వేరియంట్ వ్యాప్తి !

Telugu Lo Computer
0


ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో శనివారం హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది. ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి యూకేలో జనవరి 19వతేదీన కనుగొన్నామని, 600కంటే ఎక్కువ ఎక్స్ఈ కేసులు నిర్దారణ అయ్యాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.ఎక్స్ఈ వంటి రీకాంబినెంట్ వేరియంట్‌లకు సంబంధించిన పబ్లిక్ హెల్త్ రిస్క్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని బ్రిటన్ హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ చీఫ్ మెడికల్ అడ్వైజర్ సుసాన్ హాప్కిన్స్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)