రిచా గంగోపాధ్యాయ నెట్టింట వైరల్‌ ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 27 April 2022

రిచా గంగోపాధ్యాయ నెట్టింట వైరల్‌ !


దగ్గుబాటి రానా అరంగేట్రం చేసిన లీడర్‌ సినిమాతోనే టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రిచా గంగోపాధ్యాయ  ఆ తర్వాత మిరపకాయ్‌, మిర్చి, నాగవల్లి, భాయ్‌, సారొచ్చారు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. ప్రభాస్‌ హీరోగా నటించిన మిర్చి సినిమాలో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. తెలుగుతో పాటు కొన్ని తమిళం, బెంగాలీ సినిమాల్లోనూ చేసింది. కెరీర్‌ పరంగా పీక్స్‌ దశలో ఉండగానే అమెరికాకు వెళ్లిపోయి అక్కడ జోలాంగేల్లాతో అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఆ తర్వాత పెద్దల అనుమతితో కలిసి ఇద్దరూ పెళ్లి పీటలెక్కారు. కాగా గతేడాది మేలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రిచా తమ బిడ్డకు లూకా షాన్‌ లాంగెల్లా అనే పేరు పెట్టుకుని ప్రస్తుతం ఆ చిన్నారి ఆలనాపాలనలోనే బిజీగా గడుపుతోంది. 2013లో విడుదలైన భాయ్‌ సినిమాలో చివరిసారిగా కనిపించింది రిచా. ఆతర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె అప్పుడప్పుడు సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేస్తోంది. తన భర్త, బిడ్డ ఫొటోలను అందులో పంచుకుంటోంది. అలా తాజాగా రిచా లేటెస్ట్ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఫంక్షన్ లో భర్త, బిడ్డతో కలిసి దర్శనమిచ్చిన ఆమె నీలం రంగు లంగావోణీలో రిచా ఎంతో అందంగా కనిపించింది. అయితే తల్లయ్యాక కొంచెం బొద్దుగా మారిపోయింది. చూడగానే రిచా అని గుర్తుపట్టడం కొంచెం కష్టమనేలా మారిపోయింది. కాగా ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. 'ఇప్పటికి రిచా ఎంతో అందంగా ఉంది', 'బ్యూటిఫుల్‌ కపుల్‌' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

No comments:

Post a Comment