ఆఫీసు గోడల్లో కరెన్సీ నోట్ల కట్టలు ! - TELUGU NEWS NOW : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 26 April 2022

ఆఫీసు గోడల్లో కరెన్సీ నోట్ల కట్టలు !


ముంబై నగరంలోని కల్బాదేవి ప్రాంతానికి చెందిన చాముండా అనే వ్యాపారికి చెందిన కార్యాలయం ఉంది. ఇటీవల ఈ కంపెనీ టర్నోవర్ అకస్మాత్తుగా పెరిగిపోయింది. దీంతో జీఎస్టీ ముంబై శాఖ అధికారులకు అనుమానం వచ్చి ఆరా తీశారు. గత మూడేళ్లలో ఏకంగా రూ.23 లక్షల నుంచి రూ.1764 కోట్లకు పెరగడంతో అధికారుల్లో అనుమానాలు రేకెత్తించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆ వ్యాపారికి చెందిన వ్యాపార కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. అయితే, గోడకు అమర్చిన ఓ టైల్స్‌లో తేడా కనిపించింది. దీంతో ఆ టైల్‌ను తొలగించి చూసిన అధికారులు ఆశ్చర్యపోయారు. నగదు కుక్కిన గోనె సంచులు కనిపించడంతో వాటిని వెలికి తీశారు. తీస్తున్న కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. దీంతో అధికారులు నోరెళ్లబెట్టారు. ఈ గోనె సంచులపై ఆరా తీయగా కుటుంబ సభ్యులు తమకేం తెలియదని చెప్పారు. దీంతో జీఎస్టీ అధికారులు ఆదాయపన్ను శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు. అధికారులు వచ్చి ఆ నగదును లెక్కించగా అందులో రూ.9.8 కోట్ల నగదు, రూ.13 లక్షల విలువైన 19 కేజీల వెండి ఇటుకలు లభ్యమయ్యాయి. ఈ నోట్ల కట్టలకు సంబంధించి చాముండిపై జీఎస్టీ, ఐటీ శాఖ అధికారులు వేర్వేరుగా కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

No comments:

Post a Comment