ఎక్స్‌ఈ వేరియంట్‌పై ఆందోళన వద్దు !

Telugu Lo Computer
0


దేశంలో ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ స్ట్రెయిన్‌ తొలి కేసు నమోదైంది. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలో నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌  చీఫ్‌ డాక్టర్‌ ఎన్‌కే అరోరా మాట్లాడుతూ ఎక్స్‌ఈ తరహాలో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు. అయితే వీటితో భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో ప్రస్తుతం కేసుల సంఖ్య అంత వేగంగా పెరగడం లేదన్నారు. అయితే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవల ఒమిక్రాన్‌ కొత్త స్ట్రెయిన్‌ ఎక్స్‌ఈ తొలి కేసు గుజరాత్‌లో నమోదైన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు ముంబైలో కేసును గుర్తించామని బీఎంసీ ప్రకటించగా.. అప్పటి వరకు ఎక్స్‌ఈ వేరియంట్‌ అని నిర్ధారణ కాలేదు. ఇదిలా ఉండగా.. బీఏ.2 వేరియంట్‌ కంటే ఎక్స్‌ఈ పదిశాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)