28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 26 April 2022

28న 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ


ఆంధ్రప్రదేశ్ లోని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జగనన్న భూ హక్కు, భూ రక్ష, కీలక ప్రాజెక్టులకు భూ సేకరణ, నాడు - నేడు, స్పందన కింద అర్జీల పరిష్కారం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో కనీసం 60శాతం ఉపాధి హామీ పనులను పూర్తిచేయాలన్నారు. కలెక్టర్లు ఈ మూడు నెలల్లో పనులు ముమ్మరంగా చేయడంపై దృష్టిపెట్టాలని సూచించారు. ప్రతి జిల్లాలో కూడా ప్రతి రోజూ కనీసం 1 లక్ష పనిదినాలు చేయాలన్నారు. నెలలో కనీసంగా 25 లక్షల పని దినాలు చేపట్టాలని హితవు పలికారు. అధికారులు విస్తృతంగా పర్యటనలు చేసి, సమీక్షలు చేసి ఈ లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. జగనన్న ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సిమెంట్, స్టీలు, ఇసుక, మెటల్‌ సరఫరా సవ్యంగా సాగేలా నోడల్‌ అధికారికి బాధ్యతలు అప్పగించాలన్నారు. దీనిపై కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. డిసెంబర్‌ నాటికి 4,545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలని తెలిపారు తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని అనుకున్నామని.. కానీ కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగులో పడిందన్నారు. ఈ కేసుల పరిష్కారం కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. వీలు కాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలని తెలిపారు. దీనికి ఎంత ఖర్చు అయినా ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఆప్షన్‌ 3 కింద ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని అదే రోజు 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. అదే రోజున 1.79 లక్షల పీఎంఏవై, వైఎస్ఆర్ గ్రామీణ ఇళ్ల నిర్మాణం కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులను సత్కరిస్తామని పేర్కొన్నారు. ఏసీబీ, ఎస్‌ఈబీ, దిశ, సోషల్‌ మీడియా ద్వారా వేధింపుల నివారణ అంశాల్లో ప్రగతి ఆధారంగా ఎస్పీల పనితీరును మదింపు చేస్తామని జగన్ చెప్పారు.

No comments:

Post a Comment