దేశంలో కొత్తగా 2,451 కోవిడ్ కేసులు నమోదు !

Telugu Lo Computer
0


దేశంలో కోవిడ్ కేసులు సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. నిన్న కొత్తగా 2,451 కోవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 54 మంది కోవిడ్ తదితర కారణాలతో మరణించగా ఇంతవరకు మరణించిన వారి సంఖ్య 5,22,116కి చేరింది. నిన్న 1,589 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,16,068కి చేరింది. ప్రస్తుతం దేశంలో 14,241 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ నివేదికలో తెలిపారు. దేశంలో కోవిడ్ రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,87,26,26, 515 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశామని, నిన్న ఒక్కరోజే 1,03,558 మందికి కోవిడ్ టీకాలు వేశామని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా దేశరాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాస్క్, భౌతిక దూరం తప్పని సరి చేసింది. 18-59 ఏళ్ల మధ్య వయస్సు కలవారికి ఉచిత కోవిడ్ టీకాలను వేస్తున్నట్లు ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)