23 మంది విద్యార్థులకు కరోనా

Telugu Lo Computer
0


దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. నాలుగు స్కూళ్లలో 23 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని ఉత్తరప్రదేశ్‌ నోయిడాలో ఇది వెలుగుచూసింది. గత 48 గంటల్లో నోయిడాలో 54 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌ సోకిన వారిలో చాలా వరకు స్కూలు విద్యార్థులున్నారు. ఖైతాన్ పబ్లిక్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులు మంగళవారం కరోనా బారినపడ్డారు. దీంతో ఆ స్కూల్‌ను మూసివేసినట్లు గౌతమ్‌ బుద్ధనగర్‌ వైద్యాధికారి డాక్టర్‌ సునీల్‌ కుమార్ శర్మ తెలిపారు. నోయిడాలో కరోనా పాజిటివ్‌ విద్యార్థుల సంఖ్య 23కు చేరిందని చెప్పారు. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది సంబంధిత విద్యార్థుల ఇండ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులు, పొరుగువారికి కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తున్నారని వివరించారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ పరీక్షలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు నోయిడాలోని సెక్టార్‌ 40లోని ప్రైవేట్‌ స్కూల్‌లో 13 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఘజియాబాద్ స్కూల్‌లో 13 ఏండ్ల విద్యార్థికి కరోనా సోకింది. ఈ నేపథ్యంలో ఘజియాబాద్‌, నోయిడాలో పలు ప్రైవేట్‌ స్కూళ్లు మూతపడ్డాయి. రెండు రోజుల పాటు భౌతిక తరగతులను రద్దు చేసి ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)