ఒక్కో ఎమ్మెల్యేకు రెండు కోట్ల నిధుల కేటాయింపు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్ లో ఎమ్మెల్యేలకు వరం ప్రకటించారు. రాష్ట్రంలో ఆర్దిక పరిస్థితులు, కరోనా కారణంగా రాష్ట్రంలో డెవలప్ మెంట్ కోసం నిధులను ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యేకంగా మంజూరు చేయలేదు. 2024 ఎన్నికల దిశగా కసరత్తు ప్రారంభిస్తున్న సీఎం జగన్ ముందుగా పార్టీ ఎమ్మెల్యేలను సంసిద్దులను చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా డెవలప్ మెంట్ పనుల కోసం నిధులు మంజారు చేయాలని కోరుతూ వస్తున్నారు. దీంతో శాసనసభలోని ఎమ్మెల్యేలందరికీ పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరి నియోజక వర్గానికి రెండు కోట్ల చొప్పున కేటాయించారు. ఎమ్మెల్యేలు గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం ఈ నిధులు మంజూరు చేస్తారు. దీనిని మంత్రి బుగ్గన తన బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ డెవలప్ మెంట్ ప్యాకేజీ ఫండ్ గా దీనిని ఖరారు చేసారు. ఇందు కోసం తాజా బడ్జెట్ లో రూ 350 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లుగా మంత్రి ప్రకటించారు. ఇక, అమరావతిని ఆరు నెలల కాలంలో పూర్తి చేయాలంటూ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దీని కోసం అమరావతికి నిధుల కేటాయింపు పైన అందరూ ఆసక్తిగా చూసారు. కానీ, బడ్జెట్ లో ఎక్కడా ప్రత్యేకంగా అమరావతి ప్రస్తావన లేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)