రోజుకు వెయ్యి రూపాయలు, పనిని బట్టి బోనస్‌లు!

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని జైపూర్‌లోని శాస్త్రినగర్ పరిధిలోని ఇర్ఫాన్, మహ్మద్ మొహసిన్ అనే వ్యక్తులు కొన్ని నెలల క్రితం వాహనాలు దొంగిలించే దందాను ప్రారంభించారు. మహ్మద్ హేల్ ఖురేషి, ఇమ్రాన్, భురా, జిలు కరిషి, రవి రాథోడ్‌ అనే వ్యక్తులు రాత్రి సమయాల్లో వీధుల్లో పార్క్ చేసి ఉంచిన వాహనాలను దొంగిలిస్తుంటారు. పగటి పూట వాటిని తమ గొడౌన్‌కు తీసుకెళ్లి వాటి విడి భాగాలను నగరంలోని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేస్తుంటారు. ఈ ప్రక్రియను ఇమ్రాన్, జగదీష్ కుమార్, ఇమ్రాన్ ఖురేషి అనే ముగ్గురు వ్యక్తులు నిర్వహిస్తుంటారు. ఒక్కో వ్యక్తికి ఇర్ఫాన్ రోజుకు వెయ్యి రూపాయలు జీతంగా ఇస్తుంటాడు. ఆ జీతం కాకుండా పనిని బట్టి బోనస్‌లు, ఇన్సెంటివ్‌లు కూడా ఇచ్చేవాడు. ఇటీవల పోలీసులు ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. పది మంది సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి దాదాపు 90 ద్విచక్ర వాహనాల ఇంజన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవే కాకుండా వందలాది బ్యాటరీలు, ఇతర వస్తువులు కూడా దొరికాయి. వీరు ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన వాహనాలను చోరీ చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)