No title

Telugu Lo Computer
0


జమ్మూ కాశ్మీర్‌లో భారత భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు జమ్మూకాశ్మీర్ పోలీసులు శనివారం తెలిపారు. జమ్మూ కాశ్మీర్‌ లోని కుప్వారా జిల్లాలోని హంద్వారా వద్ద మరియు పుల్వామా, గందర్వాల్ జిల్లాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లలో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమవ్వగా మరొకరు సజీవంగా పడ్డుబడ్డాడు. పుల్వామా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లో జైషే మహ్మద్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు, హమద్వారా, గందర్‌బల్‌లలో జరిగిన ఎన్కౌంటర్లలో లష్కరే తొయిబాకు చెందిన మరో ఇద్దరు హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది సజీవంగా పట్టుబడ్డాడు. పుల్వామాలో, చేవల్‌కలన్ గ్రామంలో ఉగ్రవాదులు నక్కివున్నారన్న సమాచారంతో శుక్రవారం సాయంత్రం జమ్మూకాశ్మీర్ పోలీసులు, భారత భద్రతా దళాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించారు. 'ఇందులో ఇప్పటివరకు ఇద్దరు జైష్ ఉగ్రవాదులు హతమయ్యారు, కుప్వారాలోని హంద్వారా ప్రాంతంలోని రాజ్‌వార్ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరొక ఉగ్రవాది హతమయ్యాడు. గందర్‌బాల్‌ ఎన్‌కౌంటర్‌లో నాలుగో ఉగ్రవాది హతమయ్యాడు' అని జమ్మూ కాశ్మీర్ ఐజీపీ శనివారం ఉదయం ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)