అన్నాఫ్లైవోవర్‌ సుందరీకరణకు సన్నాహాలు

Telugu Lo Computer
0


చెన్నై నగరంలో 'జెమినీ బ్రిడ్జి'గా పిలిచే అన్నా ఫ్లైఓవర్‌ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని రూ.9 కోట్ల వ్యయంతో ఆ ఫ్లైఓవర్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దటానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఫ్లైఓవర్‌ రాధాకృష్ణన్‌ రోడ్డు, జీఎన్‌ శెట్టి రోడ్డు, నుంగంబాక్కం హైరోడ్డు కలిసే చోట నిర్మితమైంది. ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే నిమిత్తం మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి 1971లో కొత్త ఫ్లైఓవర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో రూ.66లక్షల వ్యయంతో 250 మీటర్ల పొడవు, 48అడుగుల వెడల్పుతో 21 నెలల వ్యవధిలో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. 1973 జూలై ఒకటిన ఈ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన కరుణానిధి ఫ్లైవోర్‌కు అన్నా ఫ్లైఓవర్‌గా నామకరణం చేశారు. అయితే ఈ ఫ్లైఓవర్‌ నిర్మించిన ప్రాంతం వద్ద గతంలో జెమినీ స్టూడియో ఉండేది. ఆ కారణంగా ఈ ఫ్లైఓవర్‌ను ఇప్పటికీ నగరవాసులు జెమినీ బ్రిడ్జిగా పిలుస్తున్నారు. నగరంలో తొట్టతొలుత నిర్మించిన ఫ్లైఓవర్‌గా అన్నా ఫ్లైఓవర్‌ నగరచరిత్రలో స్థానం సంపాదించుకుంది. వచ్చ యేడాది ఈ ఫ్లైఓవర్‌ నిర్మించి యాభైయేళ్లు పూర్తికానున్నాయి. ఆ సందర్భంగా ఫ్లైఓవర్‌ స్వర్ణోత్సవాలను ప్రభుత్వం వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా రూ.9కోట్ల వ్యయంతో ఆ ఫ్లైఓవర్‌ను అందంగా తీర్చిదిద్దనున్నారు. ఆ మేరకు ఆ ఫ్లైఓవర్‌ కూడలిలో కతీడ్రల్‌రోడ్వు పైపున పల్లవుల కాలం నాటి శిల్పాన్ని తలపించేలా ఆరు అడుగుల ఎత్తు కలిగిన అందమైన సింహపు విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఫ్లైఓవర్‌పై ప్రవేశించే మార్గాలు, బయటపడే మార్గాలు అంటూ ఎనిమిది వైపులా అందమైన శిలా స్తూపాలను నిర్మించనున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శిల్పకళానిపుణుడు స్రోస్కీ మరుదు ఈ శిల్పస్తూపాలు, శిల్పాలను రూపొందించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)