తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 31 March 2022

తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం


ఎండకాలం వచ్చేసింది. భానుడి భగభగలను భరించలేక తెలుగు రాష్ట్రాలలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎండలు ఇప్పుడే ఈ స్థాయిలో ఉంటే రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో అని జనం బెంబేలెత్తుతున్నారు.  కొద్ది రోజులుగా సూర్య ప్రతాపానికి తాళలేక జనం అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే 40 డిగ్రీలకు పైగా ఉష్ణొగ్రతలు నమోదవుతున్నాయి. మున్ముందు ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండ నుంచి ఉపశమనం కోసం చల్లని పానీయాలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు పగబడుతుండడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణొగ్రతలతో అటు ప్రభుత్వాలు కూడా అలర్టయ్యాయి. తెలంగాణలో పాఠశాలల సమయాన్ని తగ్గించాలని ఇప్పటికే ఆదేశించాయి. రానున్న నాలుగు రోజులు ఉష్ణొగ్రతలు, వడగాడ్పులు మరింత పెరుగుతాయని ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్నారు. రేపు, ఎల్లుండి ఉత్తర తెలంగాణలో వడగాలుల వీచే అవకాశం ఉందని వాతావరం శాఖ హెచ్చరించింది. ప్రస్తుతం నమోదవుతున్న ఉష్ణొగ్రతల కంటే మరో రెండు డిగ్రీలు అదనంగా నమోదవుతాయని స్పష్టం చేసింది. అత్యవసరం అయితే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని  తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు హెచ్చరించారు. 

No comments:

Post a Comment