షాంఘైలో లాక్ డౌన్

Telugu Lo Computer
0


కరోనా మహమ్మారి చైనాను వణికిస్తోంది. రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో అక్కడి  ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. కొత్తగా ఈ దేశంలో 6,215 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో శుక్రవారం 4,790, శనివారం 5,600 కొత్త కేసులు నమోదయ్యాయి. జీరో కోవిడ్ స్ట్రాటజీని అవలంభిస్తున్న చైనా ఎక్కడికక్కడ ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా చైనాలో వాణిజ్య రాజధాని అయిన షాంఘైలో లాక్ డౌన్ విధించారు. దీంతో 2.6 కోట్ల మంది ప్రజలు ఆంక్షల్లోకి వెళ్లారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అన్ని కార్యాలయాలు, ప్రజా రవాణాను నిలిపివేసింది. ప్రజలకు పెద్ద ఎత్తున పరీక్షలు చేపడుతోంది. మార్చి నెలలో రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఏకంగా 56000 కేసులు బయటపడ్డాయి. ముఖ్యంగా ఈశాన్య ప్రావిన్స్ అయిన జిలిన్ లో వ్యాప్తి ఎక్కువగా ఉంది. గతంలో కరోనా కారణంగా టెక్ సిటీ షెన్ జెన్ లో కూడా లాక్ డౌన్ విధించారు. చైనాలో బీఏ 2 వేరియంట్ వల్లే కేసులు పెరుగుతున్నాయని WHO వెల్లడించింది. ఓమిక్రాన్ కన్నా వేగంగా బీఏ2 వ్యాప్తి చెందుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)