ఏఎస్ఐ రాసలీలలు ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 9 March 2022

ఏఎస్ఐ రాసలీలలు !


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా అవుకు పట్టణంలో సుమలత అనే మహిళ భర్త ఐదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆమె పట్టణంలో జీవిస్తోంది. ఆమెకు ఏఎస్ఐ ఫక్రుద్దీన్‌తో పరిచయం ఏర్పడింది. దీంతో తరచూ ఆమె ఇంటికి ఏఎస్ఐ వచ్చి పోతుండే వాడు. సుమలతకు పట్టణానికే చెందిన బొడ్డు సుజాత అనే మహిళతో స్నేహం కుదిరింది. ఆమె అవసరం ఉందని అడిగితే కాదనకుండా రూ.6 లక్షలను సుమలత అప్పుగా ఇచ్చింది. కొంత కాలానికి ఏఎస్ఐను సుమలత దూరం పెట్టసాగింది. మరో వ్యక్తితో ఆమె చనువుగా ఉంటోందని ఏఎస్ఐ ఫక్రుద్దీన్ భావించాడు. సుమలత స్నేహితురాలు సుజాతతో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో కూడా సన్నిహితంగా మెలిగాడు. ఇదిలా ఉండగా తానిచ్చిన అప్పు రూ.6 లక్షలు తిరిగి ఇవ్వాలని సుజాతను సుమలత అడిగింది. ఇటీవల కాలంలో ఆమె మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని సుజాత తన స్నేహితురాలిని అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ వేసింది. విషయం తెలుసుకున్న ఏఎస్ఐ ఫక్రుద్దీన్ దీనికి మరింత ఆజ్యం పోశాడు. సుమలతపై ఆగ్రహంతో ఉన్న ఆయన హత్య ఎలా చేయాలో, చేసిన తర్వాత ఎలా తప్పించుకోవాలో నిందితులకు సూచనలిచ్చాడు. సుజాతకు రామకృష్ణ, వసంత అనే వారు జత కలిశారు. ఫక్రుద్దీన్ సూచనలతో సుమలతను జనవరి 16న దారుణంగా హత్య చేశారు. క్లూలు ఏవీ దొరకకపోవంతో పోలీసులు విచారణ తీవ్రం చేశారు. ఇందులో ఏఎస్ఐ ప్రమేయం బయటపడడంతో పరారీలో ఉన్న అతడి కోసం గాలింపు చేపట్టారు. మిగిలిన నిందితులను అరెస్టు చేశారు.


No comments:

Post a Comment