ఆరు రాష్ట్రాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌ హైవే - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 8 March 2022

ఆరు రాష్ట్రాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌ హైవే


చెన్నై-సూరత్‌ మధ్య ఆరు రాష్ట్రాలను కలుపుతూ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఏర్పాటు చేయనున్నట్లు 2019లో జాతీయ రహదారుల కమిషన్‌ ప్రకటించింది. సూరత్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ రహదారి మహారాష్ట్రలోని నాసిక్‌, షోలాపూర్‌, కర్ణాటక, తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల మీదుగా చెన్నై, కొల్‌కతా హైవేతో అనుసంధానం కానుంది. ఈ రోడ్ల నిర్మాణానికి రూ.50 వేల కోట్లను ఆ శాఖ కేటాయించింది. తొలివిడతగా సూరత్‌-నాసిక్‌-షోలాపూర్‌ మధ్య 504 కి.మీ, రెండో విడతగా షోలాపూర్‌- కర్నూల్‌-తిరుపతి-చెన్నై మధ్య ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో 156 కి.మీ దూరం ఈ రహదారి ఏర్పాటుకానుంది. చెన్నై-కర్నూల్‌ మధ్య రహదారి పనులకు మాత్రమే రూ.10 వేల కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment