ఎండాడ శ్రీవారి ఆలయంలో విమాన కలశ స్థాపన

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  విశాఖ జిల్లా ఎండాడ కొండపై తితిదే నిర్మించిన శ్రీవారి ఆలయ మహా సంప్రోక్షణ పూజాది కార్యక్రమాల్లో భాగంగా సోమవారం ఉదయం నుంచి అర్చకులు యాగశాలలో ప్రత్యేకపూజలు జరిపారు. ఉదయం 6 నుంచి 9 గంటల వరకు హోమం, జలాధివాసం, యాగశాల కార్యక్రమాలు, రత్నన్యాసం, విమాన కలశ స్థాపన తదితర పూజాది కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం 6 నుంచి హోమం, యాగశాల పూజలు నిర్వహించారు. ఈనెల 23న జరిగే విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణకు అవసరమైన ఏర్పాట్లు తి.తి.దే. అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మహా సంప్రోక్షణకు ముఖ్యమంత్రి హాజరవుతున్న తరుణంలో మంగళవారం నాటికి తి.తి.దే.కు చెందిన ఉన్నత అధికారులు, పాలకమండలి సభ్యులు నగరానికి రానున్నారు. ఉదయం 6 నుంచి 9 గంటలవరకు, సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకు శ్రీవారి భక్తులు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నారు. పలువురు గాయకులు శ్రీవారి సంకీర్తనలతో పాటు పలు భజనలు, భక్తిగీతాలను ఆలపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)