ఉత్తరాఖండ్ సీఎం.గా రీతూ ఖండూరీకి అవకాశం?

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా తొలిసారిగా మహిళను నియమించాలని భాజపా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్కర్ సింగ్ ధామి ఓటమితో నూతన సారథి ఎవరనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తదుపరి సీఎంగా ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి బీసీ ఖండూరీ కుమార్తె రీతూ ఖండూరీ పేరు బలంగా వినిపిస్తోంది. కోట్‌ద్వార్ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆమె తొలి మహిళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రీతూ ఖండూరీ భర్త, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మోదీకి సన్నిహితుడు. ప్రభుత్వ ఏర్పాటు, సీఎం అభ్యర్థిపై చర్చించేందుకు దిల్లీ రావాలంటూ రీతూకు పిలుపు రావడం ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. మరోవైపు పుష్కర్ సింగ్ ధామి, సుబోధ్ ఉనియాల్‌లను సైతం దిల్లీ రావాలని అధిష్ఠానం కబురు పంపింది. రీతూ ఖండూరీతోపాటు మరో ఆరుగురు నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, కేంద్ర మాజీమంత్రి రమేశ్ పోఖ్రియాల్, రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ పేర్లు వినిపిస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)