ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 March 2022

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహూర్తం ఖరారు


ఆంధ్రప్రదేశ్ లో పునర్విభజన కసరత్తు తుది దశకు చేరకుంది. అయితే ముందుగా అనుకున్న తేదీ కాకుండా కొత్త జిల్లాల ఏర్పాటు  ఏప్రిల్ 4కి మారింది. ఉగాదికి అనుకున్నప్పటికీ. ఏప్రిల్ 4వ తేదీన ఉదయం 9.05 గంటల నుంచి 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం చేయాలని ముహూర్తం ఖరారు చేసింది. ఇప్పుడున్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా మారుస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 26న డ్రాప్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన క్రమం నుంచి వేగంగా జిల్లాల ఏర్పాటు కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే కొత్త జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం భవనాల సేకరణ కూడా దాదాపుగా పూర్తయింది. ఉద్యోగుల విభజన కూడా చకచక సాగుతోంది. ఇదిలా ఉంటే మార్చి 31న తుది నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నప్పటికీ… ఇది కూడా కొద్దిగా ఆలస్యం అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాల ఏర్పాటు పై వచ్చిన అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం స్వీకరించింది. 10 వేలకు పైగా అభ్యంతరాలు వచ్చినా… ఇవన్నీ కేవలం 70 నుంచి 80 వరకు అంశాలపైనే ఉన్నాయి. అయితే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో 90 శాతం యదాతథంగా ఉంటుందని.. కేవలం 10 శాతం మార్పులు కూడా జరిగాయని తెలుస్తోంది. అభ్యంతరాల్లో శ్రీబాలాజీ జిల్లాను తిరుపతిగా ఉంచాలనే అభ్యంతరాన్ని పరిగణలోకి తీసుకుంది. శ్రీ బాలాజీ జిల్లాను తిరుపతిగా మార్చింది.

No comments:

Post a Comment