నగరి నుంచి పోటీ చేస్తా : వాణీ విశ్వనాథ్

Telugu Lo Computer
0


చిత్తూరు జిల్లా నగరి నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రోజాకు ప్రత్యర్థి సిద్ధమవుతున్నారు. ఆమె కూడా ఓ స్టార్ హీరోయిన్  వాణీ విశ్వనాథ్ కావడం విశేషం. ఆమె నగరిలో రోజాపై పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. బుధవారం నగరిలో పర్యటించిన వాణీ విశ్వనాథ్. వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేయడం ఖాయమన్న ఆమె ఏ పార్టీ నుంచి బరిలో దిగుతాననేది మాత్రం చెప్పలేనన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటానని అవసరమైతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని ప్రకటించారు. తనకు నగరిలో అభిమానులు, శ్రేయోభిలాషులున్నారని తెలిపారు. తన మేనేజర్ రామానుజంను రాజకీయంగా ఇబ్బంది పెట్టడం సహించలేకే నగరిలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు వాణి విశ్వనాథ్ చెప్పారు. నగరిలో తనకు అభిమానులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు ఆదరణ సైతం ఉందన్నారు. రోజా ప్రాతినిథ్యం వహిస్తన్న నగరిలో వాణి విశ్వనాథ్ కు మహిళలు ఘనస్వాగతం పలకడం విశేషం. 

Post a Comment

0Comments

Post a Comment (0)