కొబ్బరి నూనె, కర్పూరం మిశ్రమం - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


కొబ్బరినూనెలో కర్పూరం కలిపి రాస్తే ఎన్నో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కొబ్బరినూనెలో కర్పూరం వేసి బాగా కలిపి ఆ నూనెను మొటిమలు ఉన్న ప్రదేశంలో రాత్రి సమయంలో రాసి ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే నల్లని మచ్చలు తొలగిపోతాయి. ఎలర్జీ, దద్దుర్లు ఉన్నప్పుడు కూడా ఆ ప్రదేశంలో కర్పూరం కలిపిన కొబ్బరి నూనె రాసి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చుండ్రు సమస్యకు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. చుండ్రు సమస్య ఉన్నప్పుడు కర్పూరం కలిపిన నూనెను కాస్త వేడి చేసి తలకు బాగా పట్టించి పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయాలి. వారంలో రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండుట వలన గోర్లపై వచ్చే ఇన్ ఫెక్షన్స్ ని తగ్గించటానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. కొబ్బరి నూనె ఆర్గానిక్ అయితే మంచి ఫలితాలు చాలా తొందరగా వస్తాయి.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)