ఆనంద్ మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ!

Telugu Lo Computer
0


మహీంద్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీ పెట్టేందుకు ఏమైనా అవకాశాలున్నాయా ? అనేది చూడాలంటూ టెక్ మహీంద్రా చీఫ్ సీపీ గుర్నానిని ఆనంద్ మహీంద్రా ఆదేశించారు. ఇతర దేశాలకు వైద్య విద్య చదివేందుకు ఎంతమంది విద్యార్థులు వెళుతున్నారో గణాంకాలను ఓ జాతీయ పత్రిక ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన ట్వీట్ లో వెల్లడించారు. ఒకవేళ మెడికల్ కాలేజీ వస్తే.. అది హైదరాబాద్ లో వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల ప్రాంగణంలో మహీంద్రా యూనివర్సిటీ ఉంది. మహీంద్రా ఆలోచన సక్సెస్ అయితే హైదరాబాద్ క్యాంపస్ లో మెడికల్ కాలేజీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ దేశంపై రష్యా యుద్ధానికి పాల్పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది చనిపోతున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి లక్షలాది మంది వలసలు వెళ్లిపోతున్నారు. అందులో విద్యార్థులున్నారు. వేలాది మందిగా ఉన్న భారత విద్యార్థులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగను చేపట్టింది. నవీన్ అనే విద్యార్థి బాంబు దాడిలో చనిపోవడం, పంజాబ్ విద్యార్థి అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో అందరీలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. అయినా.. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. అందరినీ సురక్షితంగా ఇండియాకు రప్పిస్తామని వెల్లడిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)