యువకుని ఆత్మహత్య !

Telugu Lo Computer
0


రాజస్థాన్, గంగాపూర్‌లోని రామ్‌రహీం ప్రాంతానికి చెందిన ఓ కుటుంబంలో తండ్రి సంషుద్దీన్‌తో పాటు ఓ కూతురు, కొడుకులు బారిష్ ఖాన్, అమీర్ ఖాన్‌లు ఉంటున్నారు. వీళ్లంతా ఎప్పటిలాగే మంగళవారం రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఎవరి గదుల్లో వారు నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సంషుద్దీన్ కూతురికి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న బారిష్ ఖాన్ గదిలో లైట్ ఇంకా ఆన్ చేసి ఉండడంతో ఆమెఅనుమానంతో వెళ్లి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించింది. కానీ లోపలి నుంచి గడియ పెట్టి ఉండడంతో కిటికీలో నుంచి గదిలోకి చూసింది. అక్కడ ఉరికి వేలాడుతున్న తమ్ముడి శవాన్ని చూసి పెద్దగా కేకలు వేసింది. ఆ శబ్దానికి ఇంట్లోని వారందరూ నిద్ర లేచారు. తలుపులు పగులగొట్టి అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే బారిష్ చనిపోయాడు. మృతుడి సోదరుడు అమీర్ ఖాన్ తన అన్న మద్యానికి బానిసయ్యాడని తెలిపాడు. ప్రతిరోజూ రాత్రి పూటుగా తాగి ఇంటికి వచ్చేవాడని చెప్పాడు. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులుశవానికి పోస్టుమార్టం నిర్వహించి బుధవారం కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)