ది క్లైమేట్ ప్లెడ్జ్ పై టెక్ మహీంద్రా సంతకం

Telugu Lo Computer
0


'ది క్లైమేట్ ప్లెడ్జ్'పై సంతకం చేయనున్న 97 కంపెనీల్లో... టెక్ మహీంద్రా కూడా చేరింది. ఇతర కంపెనీల్లో హర్మాన్, ఎస్‌ఏసీ, మార్స్క్ ఉన్నాయి. క్లైమేట్ ప్లెడ్జ్'పై సంతకం చేయడమంటే వ్యాపారం/సంస్థ గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను క్రమం తప్పకుండా కొలవడానికి, నివేదించడానికి అంగీకరించడం. టెక్ మహీంద్రా, ఎస్‌ఏపీ, మార్స్క్, హర్మాన్‌ సహా వంద మంది 'ది క్లైమేట్ ప్లెడ్జ్'లో ఇప్పటికే చేరారు. పారిస్ ఒప్పందాన్ని పది సంవత్సరాల ముందుగానే చేరుకోవడానికి, 2040 నాటికి నికర-జీరో కార్బన్‌గా ఉండాలనే నిబద్ధతగా ఈ క్రమాన్ని భావిస్తున్నారు. కాగా... 2019 లో అమెజాన్, గ్లోబల్ ఆప్టిమిజం సహ 312 సంస్థలు ఇప్పటివరకు ది క్లైమేట్ ప్లెడ్జ్‌పై సంతకం చేశాయి. ప్రతిజ్ఞ చేసిన సంతకాలు మొత్తంగా $ 3.5 ట్రిలియన్లకు పైగా ప్రపంచ వార్షికాదాయాన్ని ఆర్జించడమే కాకుండా, 29 దేశాల్లోని 51 పరిశ్రమల్లో 8 మిలియన్లకు పైగా ఉద్యోగులు ఈ క్రమంలో పనిచేస్తున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)