థైరాయిడ్ - కొబ్బరి ముక్క ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 30 March 2022

థైరాయిడ్ - కొబ్బరి ముక్క !


శరీరంలోని జీవక్రియుల సరిగా సాగేందుకు థైరాయిడ్  గ్రంధి పనితీరు చాలా ముఖ్యం. ప్రపంచంలో ప్రతి మందిలో అయిదుగురు థైరాయిడ్ గ్రంధి సరిగా పనిచేయక ఇబ్బంది పడుతున్నారు. థైరాయిడ్ సమస్య రెండు రకాలు. హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ అధిక ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం సమస్య మొదలవుతుంది, అదే తక్కువ ఉత్పత్తి అయితే హైపో థైరాయిడిజం కలుగుతుంది. హైపో థైరాయిడిజం బారిన పడిన వారిలో హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరం బరువు పెరుగుతుంది. మందులు వాడుతూ, వ్యాయామం, మంచి ఆహారం, జీవనవిధానం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు. హైపో థైరాయిడిజంతో బాధపడుతున్న వారు అయోడైజ్డ్ ఉప్పునే వాడాలి. అలాగే ఆలివ్ నూనెతో చేసిన వంటలు తింటే మేలు. గుడ్లు, పాలు, చేపలు, చిక్కుళ్లు, అవిసెగింజలు తింటే ఆరోగ్యానికి మంచిది. ఇక హైపర్ థైరాయిడిజం బారిన పడినవారు ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బచ్చలికూర, పాలకూర, బ్రకోలీ, క్యారెట్లు, టమోటాలు, క్యాప్సికమ్, దోసకాయ వంటివి తినవచ్చు. సీజన్ కు తగ్గట్టు దొరికే పండ్లను తిన్నా ఎంతో లాభం. వేసవిలో లభించే మామిడి, జామకాయలు ఎన్నయినా తినవచ్చు. హైపర్ థైరాయిడిజంతో బాధపడేవారికి మేలు చేసే మరో ఆహారపదార్థం కొబ్బరి ముక్క. పచ్చి కొబ్బరిని రోజూ తింటే థైరాయిడ్ సమస్య తగ్గుముఖం పడుతుంది. సమతులాహారంలో కొబ్బరి ముక్క కూడా ముఖ్యమైనదే. కొబ్బరిలో ఫ్యాటీ ఆమ్లాలు జీవక్రియలను సక్రమంగా జరిగేలా చూస్తాయి. ఎండుకొబ్బరిని కాస్త కష్టమే అయినా తింటే చాలా ఆరోగ్యం. దాని నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. థైరాయిడ్ సమస్య వల్ల కలిగే ఇబ్బందిని కొబ్బరి ముక్క తీరుస్తుంది. పచ్చి కొబ్బరి ముక్కని తినడం లేదా ఎండుకొబ్బరితో చట్నీలు చేసుకుని తినడం, కూరల్లో చల్లుకోవడం చేయాలి. ఏదో రూపంలో కొబ్బరిని తినడం థైరాయిడ్ వ్యాధిగ్రస్తులకు అవసరం. కొబ్బరి కేవలం థైరాయిడ్ సమస్యను తగ్గించడమే కాదు, బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. దానిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె జబ్బులను రానివ్వకుండా అడ్డుకుంటుంది. మతి మరుపు వ్యాధిని రానివ్వదు. హైపోథైరాయిడిజం వారికి కొబ్బరి ఏవిధంగా ఉపయోగపడుతుందో మాత్రం తెలియదు. వారు ఓసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

No comments:

Post a Comment