గవర్నర్‌ను కలిసిన భగ్వంత్ మాన్

Telugu Lo Computer
0


ఆప్ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన భగ్వంత్ మాన్ శనివారంనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్‌ను కలుసుకుని ప్రభుత్వం ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని, అందుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరారు. గవర్నర్ రాజ్‌భవన్‌కు ఆయనతో పాటు ఆప్ పంజాబ్ ఇన్‌చార్జి రాఘవ్ చద్దా కూడా వెళ్లారు. గవర్నర్‌తో సమావేశం అనంతరం మీడియాతో భగ్వంత్ మాన్ మాట్లాడుతూ, ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన లేఖను గవర్నర్‌కు సమర్పించామని, ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరామని చెప్పారు. ఎప్పుడు ప్రమాణస్వీకారం అనుకుంటున్నారని గవర్నర్ ప్రశ్నించినట్టు చెప్పారు. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్వస్థలమైన ఖాట్కర్ కళన్‌లో ఈనెల 16వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం ఉంటుందని మాన్ తెలిపారు. ప్రమాణస్వీకారానికి పంజాబ్ ప్రజలంతా ఆహ్వానితులేనని, వారు సైతం భగత్ సింగ్‌కు నివాళులర్పించ వచ్చని చెప్పారు. ''మంచి మంత్రివర్గం ఉంటుంది. చారిత్రక నిర్ణయాలు ఉంటాయి. గతంలో ఎవరూ తీసుకోని నిర్ణయాలు తీసుకుంటాం. వేచిచూడండి'' అని ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)