హెయిర్‌ ట్రాన్స్ ప్లాంట్‌తో జవాన్‌ మృతి

Telugu Lo Computer
0


బీహార్ స్పెషల్ ఆర్మ్ డ్ పోలీస్‌లో నియమితులైన మనోరంజన్ పాశ్వాన్ అనే సైనికుడి వివాహం మే 11న జరగాల్సి ఉంది. కాగా అతని తల ముందు వెంట్రుకలు రాలిపోయాయి, దీంతో హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాడు. పాట్నాలోని బోరింగ్ రోడ్‌లోని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ అండ్ స్కిన్ కేర్ సెంటర్‌లో మనోరంజన్ చికిత్స పొందుతూ మరణించాడని మనోజ్ పాశ్వాన్ సోదరుడు తెలిపాడు. బీహార్ పోలీస్‌లో సబ్-ఇన్స్ పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. మార్చి 9న హెయిర్‌ ట్రాన్స్ ప్లాంట్‌ చేయించుకున్నాడని అయితే 24గంటల తర్వాత విపరీతంగా తలనొప్పి , ఛాతీలోమంట వచ్చింది. దాంతో అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తోటి సైనికులు అతన్ని హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ కి తీసుకువెళ్ళారు. అక్కడ నుండి సెంటర్ సభ్యులు అతన్ని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ జవాన్ మృతి చెందాడు.


Post a Comment

0Comments

Post a Comment (0)