దూసుకొస్తున్న 'అసని' తుఫాన్

Telugu Lo Computer
0


ఈ ఏడాది భారత్‌ను తాకడానికి తొలి తుఫాన్ దూసుకొస్తోంది. నైరుతి హిందూ మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందని వచ్చే వారం ప్రారంభంలో అది తుఫానుగా మారుతుందని భారత మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుఫాన్ మార్చి 21న ఏర్పడనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ అంచనా వేసింది. ఏదేమైనా తుఫాన్ యెుక్క ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. మార్చి 19న, దక్షిణ అండమాన్ సముద్రంలో తేలికపాటి నుండి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అండమాన్ మరియు నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది మార్చి 20న అల్పపీడనంగా మారి మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)