శ్రీశైలానికి జస్టిస్ ఎన్వీ రమణ రాక

Telugu Lo Computer
0



సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా శ్రీశైలానికి ఈ సాయంత్రం 6:30 గంటలకు చేరుకుంటారు. జిల్లా కలెక్టర్ పీ కోటేశ్వర రావు, దేవస్థానం పాలక మండలి ఛైర్మన్, ఆలయ కార్యనిర్వాహణాధికారి ఎన్వీ రమణ దంపతులకు స్వాగతం పలకనున్నారు. అనంతరం మల్లికార్జునుడు, భ్రమరాంబ అమ్మవారిని ధూళి దర్శనం చేసుకుంటారు రాత్రి అక్కడే బస చేస్తారు. సోమవారం తెల్లవారు జామున మల్లన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కల్యాణోత్సవం, కంచిమఠంలో హోమం పూర్ణాహుతి కార్యక్రమంలో ఎన్వీ రమణ దంపతులు పాల్గొంటారు.హైదరాబాద్ నుంచి విమానంలో కర్నూలులోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గంలో ఆయన శ్రీశైలానికి వెళ్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తరచూ రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తోన్నారు. తెలంగాణలో యాదాద్రి సహా శ్రీశైలం దేవస్థానాన్ని దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు తిరుమలను దర్శించారు కొద్దిరోజుల కిందటే మరోసారి ఆయన శ్రీవారిని దర్శించారు. 2021 డిసెంబర్‌లో ఆయన సతీ సమేతంగా కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం పొన్నలూరులో పర్యటించారు. విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని సందర్శించారు. జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ హిమా కోహ్లి, తెలంగాణ హైకోర్టు సీజే సతీశ్ చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్‌, తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇందులో పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)