పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో టీఎంసీ, బీజేపీ సభ్యుల బాహాబాహీ

Telugu Lo Computer
0


పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. 2022, మార్చి 28వ తేదీ సోమవారం జరిగిన సమావేశాల్లో బీర్ భూం జిల్లాలో 8 మంది సజీవ దహనం అవ్వడంపై చర్చించాలని బీజేపీ పట్టుబట్టింది. దీంతో టీఎంసీ, బీజేపీ సభ్యుల మధ్య మాటలు తూటాలు పేలాయి. అసలు ఈ ఘటనకు కారణం బీజేపీ అంటూ టీఎంసీ ఆరోపించింది. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీ ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీలకు చెందిన సభ్యుల బాహాబాహికి దిగారు. బీజేపీ ఎమ్మెల్యే మంజుదర్ తీవ్రంగా గాయపడ్డారు. టీఎంసీ ఎమ్మెల్యేలు దాడి చేయడంతో ఆయన గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది. తమ ఎమ్మెల్యేలపై దాడి చేశారని టీఎంసీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. ఈ ఘటనపై స్పీకర్ సీరియస్ అయ్యారు. సువేందుతో సహా.. ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూం జిల్లాలో 8మంది సజీవ దహనం కేసు దర్యాప్తును సీబీఐ ముమ్మరంగా చేపడుతోంది. ఈ కేసులో ఇప్పటివరకు 22 మంది అనుమానితుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లు తెలిపింది. రాష్ట్ర పోలీసులు సమర్పించిన జాబితాలోనూ ఇంతమంది పేర్లే ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో ఇప్పటికే 20 మందిని అరెస్టు చేయగా.. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్‌ను సీబీఐ ప్రశ్నించింది. ఈ హత్యలను దుండగులు ప్రతీకారంతోనే జరిపినట్లు సీబీఐ వెల్లడించింది. వ్యక్తులను చంపాలనే ఉద్దేశంతోనే బాధితులను ఇళ్లలో ఉంచి నిప్పు పెట్టినట్లు సీబీఐ ఎఫ్‌ఆర్‌ నమోదు చేసింది. బీర్ భూంలో హింసాత్మక ఘటనపై సీబీఐ నిష్పక్షపాత విచారణ జరపాలన్నారు సీఎం మమతా బెనర్జీ. విచారణను ప్రభావితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. దీనిని ఎదుర్కొనేందుకు నిరసనకు సిద్ధమని అన్నారు. ఈ ఘటఈ న వెనుక ఏదో కుట్ర ఉన్నదని ఆమె ఆరోపించారు. కేసు దర్యాప్తును సీబీఐకి హైకోర్టు అప్పగించడం మంచి నిర్ణయమేనని చెప్పారు. అయితే బీజేపీ డైరెక్షన్‌ను సీబీఐ అనుసరిస్తే, దీనిపై నిరసన తెలిపేందుకు సిద్ధమేనని మమత హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)